: ఐఎస్ఐఎస్ పై విరుచుకుపడ్డ ఫ్రాన్స్... 30మంది ఉగ్రవాదుల హతం
అత్యంత దారుణాలకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పై ఫ్రాన్స్ తొలిసారి వైమానిక దాడులను నిర్వహించింది. సిరియాలోని తూర్పు ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్న స్థావరాలపై వైమానిక దాడులతో ఫ్రాన్స్ విరుచుకుపడింది. ఈ వివరాలను ఓ మానవహక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించింది. ఈ దాడుల్లో 30 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. వీరిలో, ఉగ్రవాదులుగా శిక్షణ పొందుతున్న 12 మంది చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఇటీవల కాలంలో, ఐఎస్ ఉగ్రవాదులు ఫ్రాన్స్ లో కూడా దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.