: పదవి కోసమే ఎర్రబెల్లి పాలకుర్తి గొడవను సృష్టించారు: కవిత


తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. జైలుకు వెళ్లే వారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పదవుల్లో తనకు చోటు దక్కడం లేదనే ఉద్దేశంతోనే ఎర్రబెల్లి దయాకరరావు పాలకుర్తి గొడవను సృష్టించారని... దీంతో, ఆయనకు పదవి దక్కిందని చెప్పారు. తెలంగాణలో ధర్నాలకు దిగుతున్న వామపక్షాలు ఇదే పనిని ఏపీలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా, వరంగల్ ఎన్ కౌంటర్ పై కూడా కవిత స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న శృతి ఎన్ కౌంటర్ లో చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ పై వాస్తవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News