: షారూఖ్ కు అల్జేరియన్ చిన్నారి లవ్ ప్రపోజ్... మీరూ చూడండి


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ఆయన్ను అభిమానించే వారున్నారు. తాజాగా ఓ షార్ట్ వీడియోను షారూఖ్ స్వయంగా పోస్టు చేశాడు. ఈ వీడియోలో అందంగా, ముద్దుగా ఉన్న ఓ అల్జేరియన్ చిన్నారి "ఐ లవ్ యూ షారుహాన్" అంటూ వచ్చీ రాని మాటలతో ప్రపోజ్ చేసింది. ఈ వీడియోను షారూఖ్ షేర్ చేయగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల సల్మాన్ ఖాన్ సైతం ఇదే తరహా వీడియోను పోస్ట్ చేశాడు. 'భజరంగీ భాయిజాన్' చిత్రాన్ని చూసిన ఓ చిన్నారి ఏడుస్తూ, సల్మాన్ ను తాను ఎంత ఇష్టపడుతున్నానన్న విషయాన్ని వెల్లడిస్తే, దాన్ని సైతం నెటిజన్లు విపరీతంగా చూసేశారు. సరే, షారూఖ్ కు చిన్నారి ఎలా ప్రపోజ్ చేసిందో మీరూ చూడండి!

  • Loading...

More Telugu News