: టీడీపీ కమిటీలపై సాయన్న అసంతృప్తి... జూనియర్ల పక్కన చోటిచ్చారని ఆవేదన
టీడీపీ పార్టీ పదవుల ప్రకటనపై ఆ పార్టీ సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నిరసన గళం విప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కమిటీల కార్యవర్గాలను నేటి ఉదయం ప్రకటించారు. తెలంగాణ కమిటీలో సాయన్నకు ఉపాధ్యక్ష పదవి దక్కింది. దీనిపై సాయన్న వేగంగా స్పందించారు. 30 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తన సీనియారిటిని పరిగణనలోకి తీసుకుని పొలిట్ బ్యూరోలో అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందని సాయన్న భావించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీలో సాయన్నను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సాయన్న, తన సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అధిష్ఠానం జూనియర్లతో కలిపి ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.