: భారత చరిత్రలో తొలిసారి... సుప్రీంకోర్టు మెట్లెక్కిన 6, 14 నెలల చిన్నారులు


భారత దేశ చరిత్రలో ఎన్నడూ రానటువంటి ఓ ఆసక్తికర కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు దాఖలు చేసింది ముగ్గురు చిన్నారులు. వీరిలో ఇద్దరు 6 నెలల వయసు ఉన్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారి కాగా, మరొకరు 14 నెలల వయసున్న బాలుడు జోయా రావ్ భాసిన్. అదే ఈ కేసుకు ప్రాధాన్యత తెచ్చింది. వీరు తమ న్యాయవాద తండ్రుల ద్వారా ఈ కేసు వేశారు. ఇంతకీ వీరు ఎందుకు కోర్టు తలుపులు తట్టారో తెలుసా? ఈ దసరా, దీపావళి సీజనులో బాణసంచాను నిషేధించాలని, ఢిల్లీలో భారత్ -5 కాలుష్య నిబంధనలు అమలు చేసేలా ఆదేశించాలని వీరు కోరుతున్నారు. "మా ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. క్రాకర్స్ పేలుడుతో ఏర్పడే కాలుష్యాన్ని మేము భరించలేము" అని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కు కల్పించాలని కోరారు. కాగా, భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీ తీరని పిల్లలు తమ హక్కుల కోసం తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా కోర్టులను ఆశ్రయించవచ్చు. తమ పిటిషన్ విషయంలో తక్షణం సుప్రీంకోర్టు కల్పించుకోవాలని, టపాకాయలు తదితర బాణసంచాను కాల్చకుండా అడ్డుకోవాలని వారు కోరారు. కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది.

  • Loading...

More Telugu News