: మోదీకి షేక్ హ్యాండిచ్చిన తరువాత 'తుడిచేసుకున్న' సత్య నాదెళ్ల... మీరూ చూడండి!


మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల క్రితం అమెరికాలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఓ చిన్న ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ కొత్త చర్చకు తెరలేపింది. మోదీతో కరచాలనం చేసిన అనంతరం సత్య నాదెళ్ల తన రెండు చేతులనూ తుడుచుకుంటూ పక్కకు వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. ఈ వీడియోకు లక్షల సంఖ్యలో 'వ్యూస్' వచ్చాయి. కాగా, సత్య నాదెళ్ల తన చర్యతో భారత ప్రధానిని అవమానపరిచారని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఉద్దేశ పూర్వకంగా అలా జరిగి ఉండదని, అది ఆయన అలవాటు కావచ్చని మరికొందరు అంటున్నారు. అసలేం జరిగిందో మీరూ చూడండి.

  • Loading...

More Telugu News