: పౌర హక్కుల నేత ఆత్మహత్యా యత్నం... గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత


వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు నేడు నిర్వహించతలపెట్టిన అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ వద్దకు ప్రజా సంఘాలు చేరకుండా పోలీసులు అడుగడుగునా కట్టడి చేశారు. పలువురు కీలక నేతలను ముందుగానే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నిర్బంద కాండను నిరసిస్తూ పౌర హక్కుల సంఘం నేత రాజ్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశారు. గన్ పార్క్ వద్ద తమను అడ్డుకున్న పోలీసుల వైఖరికి నిరసనగా రాజ్ కుమార్ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన పోలీసులు వేగంగా స్పందించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా రాజ్ కుమార్ కిరోసిన్ మంటల్లో కాలిపోయేవారే. ఈ ఘటనతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News