: అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు: చుక్కా రామయ్య


అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. వరంగల్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉదయ పోలీసులు ఆయనను గృహనిర్భంధంలో ఉంచాక తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. సీఐ తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారన్నారు. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల నేతలు, వామపక్షాలు పిలుపునివ్వడంతో విద్యార్థులు, పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.

  • Loading...

More Telugu News