: స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన నాని


స్టార్ హీరోలు, హీరోయిన్లు, భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ముందు బొక్క బోర్లా పడుతుంటాయి. కాలర్ ఎగరేసుకుని తిరిగే టాప్ హీరోలకు సైతం వణుకు పుట్టిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిత్రాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంటాయి. అలాంటి సినిమానే 'భలే.. భలే.. మగాడివోయ్'. ఈ సినిమాతో యంగ్ హీరో నాని స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాడు. ఏ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. 25 రోజుల్లో రూ. 45 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ. 50 కోట్ల మైలురాయిని దాటే దిశగా దూసుకుపోతోంది. నాని హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను... కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

  • Loading...

More Telugu News