: పెరిగిపోతున్న 'బాడీ షేమర్లు'... తన శరీరం నచ్చడం లేదంటున్న అమెరికన్ అమ్మడు!


తమ ఒంపుసొంపులు, శరీర ఆకృతి నచ్చడం లేదంటూ బహిరంగంగా ప్రకటిస్తూ 'బాడీ షేమర్ల' జాబితాలోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండగా, తాజాగా ఈ జాబితాలో అమెరికన్ మోడల్ జిజి హదీద్ (20) చేరిపోయింది. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ పెద్ద మెసేజ్ ని ఆమె ఉంచింది. "ఫ్యాషన్ షోలలో ఇతర మోడల్స్ కలిగివున్నటువంటి శరీరాకృతి నాకు లేదు. నాకిష్టం లేని శరీరాన్ని నేను ప్రదర్శిస్తున్నాను. హైఫ్యాషన్ షోలలో ఈ తరహా ఆకృతి పనికిరాదని తెలుసు" అని వ్యాఖ్యానించి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి ఆమె అందంగానే వుంటుంది. అంతర్జాతీయ ఫ్యాషన్ షోలు ఎన్నింటిలోనో పాల్గొని పేరు తెచ్చుకుంది. ఇతరులతో పోలిస్తే ఆమె సౌష్టవంలో పెద్దగా తేడా కూడా ఏమీ కనిపించదట. కానీ, ఆమె మాత్రం తన అందాలను తానే నిందించుకోవడం గమనార్హం. కాగా, గత వారంలో లీసా రే, అంతకుముందు స్వీడిష్ మోడల్ హెడెన్ గార్డ్ లు సైతం తమ శరీరాకృతులపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News