: మరింత భారీ... 93 మందితో తెదేపా తెలంగాణ కమిటీ
ఈ ఉదయం 70 మందితో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కమిటీని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ కమిటీని మరింత భారీగా చేస్తూ, ఏకంగా 93 మందికి స్థానం కల్పించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఎల్ రమణను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేర్లను ప్రకటించిన ఆయన, ఉపాధ్యక్షులుగా మండవ, సాయన్న, అన్నపూర్ణమ్మ, స్వామిగౌడ్, యూసుఫ్ అలీ, చాడ సురేష్ రెడ్డి, కృష్ణయాదవ్, ఆరికపూడి గాంధీ పనిచేస్తారని తెలిపారు. ప్రధాన కార్యదర్శులుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సీతక్క, వివేక్, మల్లయ్య యాదవ్ లను నియమించారు. అధికార ప్రతినిధులుగా వేం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రజినీ కుమారి, నర్సిరెడ్డి, రాజారాం యాదవ్, సతీష్ మాదిగల పేర్లను ప్రకటించారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా వీరేందర్‌గౌడ్, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభారాణిలను నియమిస్తున్నట్టు వెల్లడించారు.