: టీడీపీ ఆంధ్రప్రదేశ్ కమిటీ 'జంబో'... 70 మందికి చోటు!


ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కమిటీని భారీ స్థాయిలో ప్రకటించారు చంద్రబాబునాయుడు. కమిటీలో మొత్తం 70 మందికి స్థానం కల్పించారు. కమిటీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావును ప్రకటించిన చంద్రబాబు, ఉపాధ్యక్షులుగా కరణం బలరాం, జేఆర్ పుష్పరాజ్, మెట్ల సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి వ్యవహరిస్తారని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యం, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి ఉంటారని, అధికార ప్రతినిధులుగా ఎం శ్రీనివాసరావు, పి అనురాధ, మల్లెల లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్, వైబివి రాజేంద్రప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, ముళ్లపూడి రేణుకలను నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర శాఖ కోశాధికారిగా బీసీ జనార్దన్ రెడ్డి ఉంటారని తెలిపారు. పలువురికి ఈ కమిటీలో వివిధ పదవులను ఇచ్చారు.

  • Loading...

More Telugu News