: దిగొచ్చిన టీ సర్కారు...పెంచిన ‘పరిహారం’ రాష్ట్రావతరణ నుంచేనని ప్రకటన
నిన్నటిదాకా అన్నదాతల ఆత్మహత్యలపై ఏమాత్రం స్పందించని కేసీఆర్ సర్కారు ఎట్టకేలకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరిహారం ప్రభుత్వ ప్రకటన వెలువడిన నాటి నుంచి మాత్రమే వర్తిస్తుందని ఇటీవల ప్రకటించింది. ఇదేం పద్ధతంటూ నిన్న అసెంబ్లీలో విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి (2014, జూన్ 2) పెంచిన పరిహారాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.