: ఇక నెక్సస్ 5ఎక్స్, 6పీ స్మార్ట్ ఫోన్లు... మార్కెట్లోకి విడుదల చేసిన గూగుల్


సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నెక్సస్ సిరీస్ లో భాగంగా నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పీ మోడళ్లను భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. నేటి నుంచి అమెరికాలో, వారం తర్వాత ఇతర దేశాల్లో వీటి విక్రయాలకు సంబంధించిన ప్రీ బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు కూడా గూగుల్ ప్రకటించింది. అయితే భారత మార్కెట్లో ఈ ఫోన్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. మొబైల్ తయారీ కంపెనీలు హువాయి, ఎల్జీలతో కలిసి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. నెక్సస్ 5ఎక్స్ మోడల్ ధర 379 డాలర్లు (దాదాపుగా రూ.25 వేలు) కాగా, నెక్సస్ 6పీ ధర 499 డాలర్లు (దాదాపుగా రూ.33 వేలు)గా ఆ సంస్థ ప్రకటించింది.

  • Loading...

More Telugu News