: రైతుల కోసం కేజ్రీవాల్ తో చర్చించిన అక్షయ్ కుమార్
రైతు ఆత్మహత్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సమావేశమయ్యారు. తన తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన అక్షయ్, రైతు సమస్యల పరిష్కారంపై కేజ్రీవాల్ తో అరగంట పాటు చర్చించారు. ఏం చేస్తే రైతులను ఆదుకోగలమో చెప్పాలని ఆయన కోరారు. 100 రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ ఓ కార్యక్రమం ద్వారా భారీగా నిధులు సేకరించారు. అలాగే, గత నెలలో మహారాష్ట్రలో అత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకునేందుకు అక్షయ్ కుమార్ భారీ మొత్తం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే!