: మెట్రో పనులను వేగవంతం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

మెట్రో రైలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మెట్రో రైలుపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ తో మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. మెట్రో రైలు నిర్మాణ పనుల నిమిత్తం స్వాధీనం చేసుకోవాల్సిన భూముల గురించి ఆయన ప్రధానంగా చర్చించారు. మెట్రో పనులు పూర్తయిన చోట యంత్ర సామగ్రి, ఇతర వస్తువులను తొలగించాలని ఆయన సూచించారు. వాటిని తొలగించడం ద్వారా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడవచ్చని రాజీవ్ శర్మ అన్నారు.