: అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ బంకులు బంద్


అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా పెట్రోలు బంకులు మూతపడనున్నాయని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు బంద్ లో భాగం పంచుకుంటున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా అదనంగా పెంచిన వ్యాట్ ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యను పరిష్కరించేంత వరకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిలిపేస్తామని ఆయన చెప్పారు. కాగా, అక్టోబర్ 1 ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో తాము చేసిన విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే మళ్లీ బంద్ కు దిగుతున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News