: రియో ఒలింపిక్స్ తరువాత రిటైర్ అవుతా: మేరీ కోం
రియో ఒలింపిక్స్ తరువాత రిటైర్ అవుతానని మహిళా బాక్సర్ మేరీ కోం తెలిపింది. దేవుడు దయ వల్ల ఎన్నో పతకాలు సాధించానని తెలిపిన మేరీ కోం, భారత్ కు ఒలింపిక్ పతకం అందించడం తన చిరకాల వాంఛ అని చెప్పింది. 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్ లో భారత్ కు ఒలింపిక్ పతకం సాధించి, కెరీర్ ముగిస్తానని పేర్కొంది. రిటైర్మెంట్ ప్రకటించేందుకు అదే సరైన సమయమని ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మేరీ కోం అభిప్రాయపడుతోంది. కాగా, భారత మహిళల బాక్సింగ్ లో ఎంత సాధించినా ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారిణి అయినందున వివక్ష చూపుతున్నారని ఈ మధ్యే మీడియా సాక్షిగా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.