: హైదరాబాద్ లోని పల్లె చెరువుకు గండి: నిలిచిపోయిన వాహనాలు
హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట మండలంలో ఉన్న పల్లె చెరువుకు గండి పడింది. దీంతో బండ్లగూడ, మైలార్దేవ్ పల్లి రోడ్డుపైకి వరదనీరు వచ్చి చేరింది. అంతేకాకుండా జాతీయరహదారిపైకి కూడా వరదనీరు రావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. పల్లె చెరువుకు గండిపడిన సమాచారాన్ని స్థానిక అధికారులు తమ పైఅధికారులకు చేరవేశారు.