: బీహార్ అసెంబ్లీ అభ్యర్థుల్లో 99 మందిపై క్రిమినల్ కేసులు
అక్టోబర్ 12 నుంచి 5 దశల్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను దాదాపు అన్ని పార్టీలు ప్రకటించాయి. ఈ జాబితాలలో చోటు సంపాదించుకున్న 99 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 30 మంది అభ్యర్థులపై కిడ్నాప్, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. అధికారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన బీజేపీలో అత్యధికంగా 47 మందిపై క్రిమినల్ కేసులుండగా, జేడీ (యూ) అభ్యర్థుల్లో 38 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీలో ఆరుగురు, కాంగ్రెస్ లో ముగ్గురు, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా (సెక్యులర్) లో ముగ్గురు, ఎల్ జేపీలో ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది.