: మావోయిస్టు అగ్రనేత కోబాడ్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు


మావోయిస్టు అగ్రనేత కోబాడ్ గాంధీకి మూడునెలల మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల నేపథ్యంలోనే ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. అరవై ఐదేళ్ల గాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం, ఆయన ఆరోగ్యం క్షీణించిన విషయం కేసు విచారణ సమయంలో స్పష్టంగా కనపడుతున్న కారణంగానే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, ఇదే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ తప్పనిసరని అడిషనల్ సెషన్స్ జడ్జి రితేష్ సింగ్ ఆదేశించారు. కాగా, నిషేధిత సంస్థ సీపీఐ(మావోయిస్టు)కు న్యూఢిల్లీలో తమ స్ధావరం ఏర్పాటు చేసేందుకు కోబాడ్ గాంధీ యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ని గతంలో అరెస్టు చేశారు. 2009 సెప్టెంబర్ నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News