: ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ కు పోలీస్ కస్టడీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని ఢిల్లీ కోర్టు రెండు రోజుల పోలీస్ కష్టడీకి ఇచ్చింది. గృహహింస, హత్యాయత్నానికి పాల్పడుతున్నారంటూ భార్య లిపిక ఆయనపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాల మేరకు సోమనాథ్ ద్వారకా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తరువాత పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కాగా మందులు, ఇంటి భోజనం, పండ్లు, బట్టలు, తదితరాలు తెప్పించుకునేందుకు తనకు అనుమతివ్వాలంటూ కోర్టుకు సోమనాథ్ దరఖాస్తు చేసుకున్నారు.