: హర్భజన్ పెళ్లి అక్టోబర్ 29న!
టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా బాస్రా వివాహానికి ముహూర్తం కుదిరింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వచ్చే నెల 29న పంజాబ్ లో వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఐదు రోజులపాటు వివాహ వేడుక నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 1న ఢిల్లీలో రిసెప్షన్ కు హర్భజన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. సౌతాఫ్రికా సిరీస్ లో ఉన్న హర్భజన్ కు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 5 వరకు మ్యాచ్ ల విరామం లభిస్తోంది. దీంతో వివాహానికి అదే సరైన సమయమని భావించిన భజ్జీ వివాహానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. కాగా, పెళ్లి కూతురు డ్రెస్ లను డిజైనర్లు ముంబైలో డిజైన్ చేసి, ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న గీతా బాస్రాకు పార్సిల్ చేస్తున్నారు.