: మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా!: వామపక్షాల వరంగల్ లోక్ సభ అభ్యర్థి
మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వామపక్షాల వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ఎంపికైన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఎవరికీ స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు. హింసకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. అలాగే తాను పని చేస్తున్న లా కళాశాల విద్యార్థులు ఎన్నికల ఖర్చు కోసం లక్ష రూపాయలు ఇచ్చినట్టు వినోద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బషీర్ బాగ్ లా కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.