: నన్ను ఉరితీసినా సరే రిజర్వేషన్లు ఎత్తివేయడానికి అంగీకరించను: లాలూ ప్రసాద్ యాదవ్
రిజర్వేషన్లను సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఆయన మాటలపై తాజాగా ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడుతున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను తాను గానీ, తన పార్టీగానీ అంగీకరించదని తేల్చిచెప్పారు. తనను ఉరి తీసినా రిజర్వేషన్లు ఎత్తివేయడానికి అంగీకరించనని, ఇందుకు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను తాను ఉపేక్షించనని చెప్పారు.