: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మోదీ, జుకెర్ బర్గ్ వీడియో
సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ, జుకెర్ బర్గ్ వీడియో జోరుగా చక్కర్లు కొడుతోంది. సిలికాన్ వ్యాలీలో ఫేస్ బుక్ కార్యాలయాన్ని మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫేస్ బుక్ సీవోవో షెరిల్ శాండ్ బర్గ్ మోదీకి ఓ కానుక అందజేశారు. ఫోటోకి పోజు ఇస్తుండగా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించిన జుకెర్ బర్గ్ కెమెరాకు అడ్డం వచ్చారు. దీంతో మోదీ జుకెర్ బర్గ్ ను చేత్తో పక్కకి లాగారు. అనంతరం చిరునవ్వుతో ఫోటోకి పోజులిచ్చారు. కేవలం 15 సెకెన్ల నిడివి కలిగిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.