: కావలికి 'బ్రూడర్', కాకినాడకు 'ఆక్వా'... కేంద్రం రెడీ!
నూతన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటులో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో బ్రూడర్ పరిశోధన, ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో పాటు కాకినాడలో ఆక్వా పరిశోధన ఏర్పాటుకు సిద్ధమని రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఏపీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన వ్యవసాయ వర్శిటీకి సిద్ధమని పేర్కొన్న కేంద్రం, ఇందుకోసం రూ. 200 కోట్లను ఇస్తామని వెల్లడించింది. కాగా, కావలిలో ఏర్పాటు చేసే బ్రూడర్ కేంద్రంలో వివిధ రకాల గుడ్లను కృత్రిమంగా ఎలా పొదగాలన్న విషయమై జరిగే పరిశోధనలకు సహకరిస్తామని, కాకినాడ ప్రాంతంలో ఆక్వా పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఇక్కడే రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.