: తొలి అడుగు పడింది... రుణాలపై వడ్డీ తగ్గించిన స్టేట్ బ్యాంక్!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి అడుగు వేసింది. బ్యాంకు బేస్ రేటును 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నట్టు ఈ మధ్యాహ్నం ఎస్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం 9.7 శాతంగా ఉన్న కనీస బేస్ రేటు ఇకపై 9.3 శాతానికి మారుతుందని, ఈ నిర్ణయం అక్టోబర్ 5 నుంచి అమలవుతుందని వెల్లడించింది. దీంతో మిగతా అన్ని బ్యాంకులూ తాము ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను నేడో, రేపో తగ్గించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News