: అక్బరుద్దీన్ నోటా... కేసీఆర్ ఫాంహౌస్ మాట!


తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో విపక్షాల నేతలంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఫాంహౌస్ చుట్టే చక్కర్లు కొట్టారు. సభలో రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రకటన, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రసంగం తర్వాత మాట్లాడిన టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కేసీఆర్ ఫాంహౌస్ పై ఓ రేంజిలో సెటైర్లు సంధించారు. ఆ తర్వాత ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత మైకందుకున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఎర్రబెల్లి స్థాయిలోనే ఫైరయ్యారు. రాష్ట్రంలోనే కాక సొంత నియోజకవర్గంలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, సీఎం కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్ లో చక్కగా టోపీ పెట్టుకుని తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రైతులంతా కేసీఆర్ లాగే టోపీలు పెట్టుకుని తిరగాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కేసీఆర్ పాంహౌస్ లాగే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని కూడా ఓవైసీ ప్రభుత్వానికి చురకలంటించారు.

  • Loading...

More Telugu News