: కేన్సర్ తో స్కాట్లాండ్ లో కన్నుమూసిన ఆశా భోంస్లే కుమారుడు
ప్రముఖ గాయనీమణి ఆశా భోంస్లే పెద్ద కొడుకు, సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే (66) స్కాట్లాండులో నిన్న కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో 15 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆయన పలు మరాఠీ చిత్రాలకూ స్వరాలను అందించారు. సినిమాలతో పాటు పాప్, గజల్స్, భజనలు, ఫోక్ సాంగ్స్, ఖవ్వాలీలకు సంగీతం అందించారు. ఆశా భోంస్లే సోదరి, భారతరత్న లతా మంగేష్కర్ పుట్టిన రోజునాడే హేమంత్ మరణించడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ఈ కారణంతోనే లతా మంగేష్కర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.