: హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల హల్ చల్... బంగారు గొలుసుల అపహరణ


హైదరాబాద్ లో ఈ రోజు గొలుసు దొంగలు హల్ చల్ చేశారు. రెండు ప్రాంతాల్లో మహిళల మెడ నుంచి బంగారు గొలుసులు అపహరించుకుపోయారు. ఎస్.ఆర్. నగర్ లో ఓ అంగన్ వాడీ టీచర్ మెడ నుంచి నాలుగు తులాల గొలుసును అపహరించారు. అటు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఓ మహిళ మెడ నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ బాధితురాలు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బంధువని తెలిసింది. వెంటనే జూబ్లీహిల్స్, ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లలో బాధితులు పిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News