: ఏపీ, తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి వెన్నెముకైన రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను అన్వేషించట్లేదని మండిపడింది. పరిహారంతో మృతుల కుటుంబాలకు న్యాయం జరగదని, రైతు ఆత్మహత్యల శాశ్వత నివారణకు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. గతంలో చనిపోయిన రైతుల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలకు చెప్పింది. ఇటీవల చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షలకు పెంచడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. రైతు చనిపోయిన తరువాత పరిహారాన్ని పెంచి ఉపయోగమేమిటని అడిగింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News