: ఐఎస్ఐఎస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమం


నెత్తుటేర్లు ప్రవహింపజేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ చెరలో 39 మంది భారతీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాక్ లో కార్మికులుగా ఉన్న వీరిని ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే, వీరంతా క్షేమంగానే ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరింత సమాచారాన్ని సేకరించిన తర్వాత, వీరిని క్షేమంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్నం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మౌద్ అబ్బాస్ తో సమావేశం సందర్భంగా, ప్రధాని మోదీ భారతీయ బందీల అంశాన్ని లేవనెత్తారు. ఇరాక్, లిబియాల్లో ఐఎస్ చెరబట్టిన భారతీయుల గురించి ఎలాంటి సమాచారం అందినా, వెంటనే తమకు అందించాలని కోరారు. దీనికి పాలస్తీనా అధ్యక్షుడు సుముఖత వ్యక్తం చేశారు. ఏ కొద్ది సమాచారం లభించినా, వెంటనే భారత ప్రభుత్వానికి తెలుపుతామని హామీ ఇచ్చారు. పాలస్తీనా అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, ఇరాక్ లోని మోసుల్ నగరంలో నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్న 39 మంది కార్మికులను ఏడాది క్రితం ఐఎస్ ఉగ్రవాదులు అధీనంలోకి తీసుకున్నారు. వీరంతా కూడా ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. అలాగే, లిబియాలోని కోస్టల్ సిటీ సర్టేలో మరో నలుగురు భారతీయులను ఐఎస్ ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News