: ఒక కుటుంబం... ఒక కారు: కొత్త నినాదాన్ని ఎత్తుకున్న ఆప్ సర్కారు
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే, అన్ని కార్లు కొనేస్తున్నారు. తత్ఫలితంగా ఢిల్లీ రోడ్లు వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ రాజధాని నగరంలో కాలుష్యం శాతం కూడా మితిమీరిపోతోంది. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకే అక్టోబర్ 22న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ‘కార్ ఫ్రీ డే’ను ప్రకటించింది. దీనిపై ఢిల్లీ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఆప్ సర్కారు మరో కొత్త నినాదాన్ని తలకెత్తుకుంది. ‘ఒక కుటుంబం... ఒక కారు’ అన్న నినాదాన్ని ఆప్ సర్కారులో రవాణా శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి గోపాల్ రాయ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.