: 'ప్రెసిడెంట్ మోదీ'... ఒబామా టంగ్ స్లిప్!
ఐక్యరాజ్యసమితి శాంతి సదస్సులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రసంగంలో భాగంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీని తప్పుగా సంబోధించారు. 'ప్రెసిడెంట్ మోదీ...' అని ఆయన అన్నారు. "క్లీన్ ఎనర్జీ దిశగా ప్రెసిండెంట్ మోదీ చేపట్టిన చర్యలు మమ్నల్ని ఉత్సాహపరుస్తున్నాయి" అన్న ఆయన, తప్పును సవరించుకోకుండానే ప్రసంగాన్ని కొనసాగించారు. వైట్ హౌస్ అధికారులు ఒబామా ప్రసంగాన్ని సిద్ధం చేసే సమయంలో ఈ తప్పు దొర్లిందని తెలుస్తోంది. తరువాత ఆయన ప్రసంగం కాపీని మీడియాకు అందించే సమయంలో 'ప్రెసిడెంట్' పదాన్ని 'ప్రైమ్ మినిస్టర్'గా మార్చారు.