: ఆత్మహత్యలకు పాల్పడవద్దని సభ ద్వారా కోరుతున్నాం: మంత్రి పోచారం


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. రైతు సమస్యలపై చర్చిద్దామని టీఆర్ఎస్, రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతుండటంతో సభలో వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం మాట్లాడుతూ, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడరాదని సభాముఖంగా విన్నవిస్తున్నామని తెలిపారు. కేవలం వర్షాభావ పరిస్థితుల వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. అరకొర నీటితో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఒకేసారి రైతు రుణమాఫీ చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం అతి తక్కువగా ఉండటంతో, పంట నూటికి నూరు శాతం నష్టపోయిందని చెప్పారు. కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 50 శాతం పంట నాశనం అయిందని తెలిపారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలలో పూర్తి స్థాయి వర్షపాతం నమోదైందని మంత్రి పోచారం వెల్లడించారు. రైతు ఆత్మహత్యలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News