: ఒకే రోజు నాలుగు డ్రెస్సులు మార్చిన మోదీ
ఆమధ్య అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సులపై డ్రెస్సులు మార్చేశారు. ఒబామా కంటే కూడా ప్రత్యేకంగా కనిపించారు. తాజాగా అమెరికా పర్యటనలోనూ మోదీ అదే తరహా డ్రెస్ సెన్స్ పాటించారు. మోదీ అమెరికా పర్యటనలో ఆదివారం కీలకమనే చెప్పాలి. ఎందుకంటే, ఆ రోజు ఆయన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ తదితర కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మోదీ బిజీబిజీగానే గడిపారు. ఆ రోజు ఉదయం టెస్లా మోటార్స్ లో జరిగిన సమావేశానికి ఒక రకం డ్రెస్ వేసుకుని వెళ్లిన మోదీ, ఆ తర్వాత జరిగిన డిజిటల్ ఇండియా డిన్నర్ కు మరో డ్రెస్ వేసుకుని వెళ్లారు. అదే రోజు సాయంత్రం మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్లతో జరిగిన ప్రత్యేక భేటీకి మరో డ్రెస్ లో మోదీ వెళ్లారు. ఇక ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ తో జరిగిన చిట్ చాట్ లో మోదీ మరో ప్రత్యేక డ్రెస్ లో కనిపించారు.