: వచ్చే నెల 16న భారత మార్కెట్ లోకి ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్


ఎప్పుడెప్పుడా అని స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐఫోన్ తాజా మోడళ్లు ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లు వచ్చే నెల 16 నుంచి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఐఫోన్ తయారీ టెక్ దిగ్గజం యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9న అమెరికా సహా పలు దేశాల్లో ఐఫోన్ 6 ఎస్, 6ఎస్ ప్లస్ లను యాపిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్ సహా పలు దేశాల మార్కెట్లోకి వీటి ఎంట్రీపై నాడు యాపిల్ నోరు మెదపలేదు. తాజాగా వచ్చే నెల 16 నుంచి ఐఫోన్ తాజా మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు యాపిల్ ప్రకటించింది. అయితే వీటి ధరలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News