: అమెరికాలో మోదీ, షరీఫ్ ల మధ్య మాటల్లేవ్... విష్ చేసుకున్నారంతే!


భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ల మధ్య మాట కలవలేదు. అమెరికా పర్యటనలో భాగంగా రెండు దేశాల నేతలు ఒకే హోటల్ లో బస చేసినప్పటికీ వారిద్దరి మధ్య మాట కలవలేదు. ఐక్యరాజ్యసమితి సమావేశాల నిమిత్తం అమెరికా వెళ్లిన నేతలిద్దరూ న్యూయార్క్ లోని వాల్డార్ఫ్ ఆస్టోరియాలో బస చేశారు. అయితే వారిద్దరూ చివరి రోజు దాకా కనీసం ఒకరికొకరు తారసపడలేదు కూడా. అయితే చివరి రోజున మాత్రం శాంతి పరిరక్షణపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రసంగానికి హాజరైన సమయంలో మాత్రం వీరిద్దరూ తారసపడ్డారు. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ కాస్త ముందుగా హాజరు కాగా, ఆ తర్వాత కొద్ది నిమిషాలకు నవాజ్ షరీఫ్ వచ్చారు. వచ్చీ రావడంతోనే మోదీని చూసిన షరీఫ్ చేయి ఊపారు. దీనికి ప్రతిస్పందనగా మోదీ కూడా చేయి ఊపారు. మోదీ నుంచి స్పందన రావడంతో షరీఫ్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ తర్వాత వారిద్దరూ ఎవరి పనిలో వారు పడిపోయారు. సమావేశానంతరం కూడా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News