: నిమజ్జనాలు విజయవంతంగా నిర్వహించారు: అధికారులకు కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, పోలీసులు, సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నిమజ్జనం సందర్భంగా ఇక్కడ వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రధాన కార్యక్రమాలకు కూడా ఇదే పరిజ్ఞానాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిమజ్జనం తీరు తెన్నులను సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం నుంచి పర్యవేక్షించారు. నగరంలో సీసీ కెమెరాల దృశ్యాలను కేసీఆర్ కు పోలీసులు చూపించారు.