: భారత సంతతి వ్యక్తికి ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డు


అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తుల గౌరవార్ధం ఇచ్చే ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డు భారత సంతతికి చెందిన ఒక డెలివరీ వ్యాన్ డ్రైవర్ ను వరించింది. ఇటీవల అక్కడ జరిగిన ఒక సంఘటనలో 49 ఏళ్ల డీ పటేల్ మానవత్వంతో పాటు, తన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ప్రమాదం కారణంగా ఒక మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో పటేల్ ఆమె ప్రాణాలను కాపాడారు. అతని ధైర్యసాహసాల గురించి తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ ఇటీవల ఆయన్ని ప్రశంసించారు. నిజజీవితంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన పటేల్ లండన్ లో ఈ రోజురాత్రి ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డును అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News