: మణిపూర్ గవర్నర్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి
మణిపూర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్ భౌతికకాయానికి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో ముంబయిలో ఈరోజు నిర్వహించారు. సయ్యద్ పార్థివదేహానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్,స్థానిక నేతలు, ప్రభుత్వాధికారులు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన అంత్యక్రియల్లో సయ్యద్ అహ్మద్ కుటుంబీకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో పడుతున్న ఆయన ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే.