: లాలూ 'కుల' వ్యాఖ్యలు... ఊపందుకున్న మాటలయుద్ధం
‘బీహార్ ఎన్నికలు వెనుకబడిన, ఉన్నత కులాల మధ్య పోరు’ అంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో లౌకిక కూటమి, ఎన్డీయే కూటమికి మధ్య మాటలయుద్ధం ఊపందుకుంది. ఒక ఎన్నిక ప్రచార ర్యాలీలో లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క, ఓబీసీ కులాల వారు ఏకమై తమ కూటమికి ఓట్లు వేయాలంటూ లాలూ మాట్లాడడంపై బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. ఎన్డీయే అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. అయితే లౌకిక కూటమి వాదన మరో విధంగా ఉంది..వెనుకబడిన కులాల వారిని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే లాలూప్రసాద్ యాదవ్ అలా మాట్లాడారంటూ ఆ కూటమి నేతలు అంటున్నారు.