: ఆ సినిమా చూసేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోంది: షాహిద్ కపూర్


ఆ సినిమా చూసేందుకు తానే కాకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపాడు. 'షాందార్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న షాహిద్ ను, 'మీరేదైనా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారా?' అని ప్రశ్నించడంతో ఇప్పుడు ఓ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. 'తల్వార్' సినిమా కోసం తానే కాకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపాడు. 2008లో దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా 'తల్వార్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. తన తాజా సినిమా 'షాందార్' కంటే 'తల్వార్' కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని, అయితే అది ఏ కోణంలో తీశారో తనకు తెలియదని షాహిద్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News