: పౌరసేవలందించేందుకే 'ఈ-పంచాయతీ': కేటీఆర్
'ఈ-పంచాయతీ'లతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామీణులకు అన్నిరకాల పౌరసేవలందించేందుకే ఈ-పంచాయతీని చేపట్టామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రామస్థాయి పెట్టుబడిదారులు, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కేటీఆర్ మాట్లాడారు. పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా పదివేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.