: అసోంలో పడవ మునిగి 25 మంది గల్లంతు

అసోంలోని కామ్ రూప్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని కలహి నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది గల్లంతైనట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న నేషన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పడవలో దాదాపు 200 మంది ఉన్నట్టు భావిస్తున్నారు.