: అభిమాన నటిని చూసి రెచ్చిపోయిన హాలీవుడ్ నటి


హాలీవుడ్ నటి యానే హథవేకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. అలాంటి హథవే కూడా ఓ పాప్ సింగర్ కు వీరాభిమాని. 'ప్రిన్సెస్ డైరీస్', 'అలైస్ వండర్ లాండ్', 'ఇంటర్ స్టెల్లర్' వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హథవే తాజా సినిమా 'ది ఇంటెర్న్' సినిమా ప్రివ్యూ న్యూయార్క్ లోని జిగ్ ఫీల్డ్ థియేటర్ లో వేశారు. ఈ ప్రివ్యూకి హథవే అభిమాన నటి, పాప్ సింగర్ మారియా కేరీ కూడా వచ్చింది. అంతే... హథవేలోని అభిమాని ఉత్సాహంతో నిద్రలేచింది. తన అభిమాన సింగర్ని చూసి తెగ సంబరపడిపోయింది. తన సినిమా ప్రివ్యూకి మారియా కేరీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొంది. ఈ ఆనందం పట్టలేక మూర్ఛపోతానేమోనని పెర్కొంటూ తెగ హడావుడి చేసింది. ఎందరో అభిమానులను సంపాదించుకున్న హథవేలో ఇంత పెద్ద అభిమాని దాక్కుందా? అని ప్రివ్యూకి హాజరైన సెలబ్రిటీలు ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News