: ఐపీఎల్ లో ఆడడం ఇప్పుడు అక్కరకొస్తొంది: డుప్లెసిస్


ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందని సౌతాఫ్రికా టీట్వంటీ కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఢిల్లీ చేరుకున్న సౌతాఫ్రికా జట్టు ప్రాక్టీస్ కు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ, టీట్వంటీ సిరీస్ లో సహజసిద్ధంగా ఆడుతామని అన్నాడు. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉందని, దానిని ఉపయోగించుకుంటామని డుప్లెసిస్ చెప్పాడు. ఐపీఎల్ నుంచి తాము చాలా నేర్చుకున్నామని తెలిపాడు. ఈ సిరీస్ సందర్భంగా ఐపీఎల్ లో టీట్వంటీలు ఆడిన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News