: అడ్వెంచర్ టూరిజం ప్రచారం కోసం ఎంపీ స్కై జంప్!
కర్ణాటక ఎంపీ ప్రతాప్ సింహ పర్యాటక రంగంపై ప్రచారం కల్పించడానికి, వృద్ధి చేయడానికి కొత్త రకమైన ప్రయత్నం చేశారు. ఏ ప్రకటనల రూపంలోనో ప్రచారం చేసుకోకుండా తనే స్వయంగా రంగంలోకి దిగారు. 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైజంప్ చేసి సాహసం చేశారు. మైసూర్ విమానాశ్రయంలో స్కైజంప్ చేయించే సహాయకుల సాయంతో అంత ఎత్తు నుంచి కిందకు దూకారు. మైసూర్, కొడగు జిల్లాల్లో అడ్వెంచర్ టూరిజానికి ప్రచారం కల్పించేందుకు తాను ఈ స్కైజంప్ చేసినట్టు ఎంపీ తెలిపారు. ఎంపీ చేసిన ఈ సాహసానికి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో మైసూర్ లోక్ సభ నియోజవర్గం నుంచి 38 ఏళ్ల ప్రతాప్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.