: సీపీఐ నేత పన్సారే హత్యతో చోటారాజన్ కు లింక్?
మహారాష్ట్రకు చెందిన సీపీఐ నేత గోవింద్ పన్సారే హత్య కేసు విచారణలో కొత్త విషయం ఒకటి బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సమీర్ గైక్వాడ్ కు సహకరించిన వ్యక్తికి అండర్ వరల్డ్ డాన్ రాజన్ నికల్జీ అలియాస్ చోటా రాజన్ తో సంబంధాలు ఉన్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. గైక్వాడ్ కు సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డును పరిశీలించగా ఈ విషయం బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం బయటపడిన అనంతరం గైక్వాడ్ ను అధికారులు విచారణ జరపగా ఇదే విషయాన్ని అతను కూడా చెప్పినట్లు సమాచారం. తన మొబైల్ రీచార్జి షాపు వద్దకు అతను వస్తుండేవాడని, అతనికి ఫోన్లు ఇవ్వడం, రీచార్జి చేసే విషయంలో సహాయపడేవాడినని, పన్సారే హత్య కు సంబంధించి ఈ వ్యక్తి తనకు సూచనలు చేసేవాడని గైక్వాడ్ చెప్పినట్లు సమాచారం.